ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కేవలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే అవ్వలేదు.. దేశాల్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది.. ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు కూడా..
తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 25 మిలియన్లకు పైగా చేరింది.. సౌత్ లో ఏ హీరోకు లేని రికార్డు ను బన్నీ సొంతం చేసుకున్నాడు.. 25 మిలియన్ల ఫాలోయింగ్ ఉన్న నెంబర్ వన్ సౌత్ ఇండియా హీరోగా రికార్డును సొంతం చేసుకున్నాడు.. ఇంస్టాగ్రామ్ లో టాప్ లో ఉన్న స్టార్స్ ను చూస్తే.. మొదటి స్థానంలో అల్లు అర్జున్ ఉండగా, రెండో స్థానంలో విజయ్ దేవరకొండ, మూడో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు.. తర్వాత స్థానాల్లో దుల్కర్ సల్మాన్ (14.1 మిలియన్), కన్నడ స్టార్ యశ్ (13.5 మిలియన్లు), మహేష్ బాబు (13.4 మిలియన్లు), ప్రభాస్ (11.7 మిలియన్లు) ఉన్నారు. ఇక 8వ స్థానంలో విజయ్ దళపతి (10.8 మిలయన్లు)తో ఉన్నాడు.. ఈ వార్త విన్న బన్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు..
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. త్వరలోనే ప్రమోషన్స్ ను మొదలుపెట్టబోతున్నారు.. ఇక ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
