ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బన్నీ లుక్ ఊరమాస్ గా ఉంటుంది.. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి..పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా పుష్ప పుష్ప సాంగ్ ను రిలీజ్ చేశారు.. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో పాటుగా ట్రోల్స్ కు గురవుతుంది..
గతంలో వచ్చిన పుష్ప టైటిల్ సాంగ్ ఎంతగా హిట్ టాక్ ను అందుకుందో ఇప్పుడు అంతకు మించి హిట్ అవ్వాలని దేవి పుష్ప 2 ఫస్ట్ సింగిల్‌ను ప్లాన్ చేశారు. ఇక ఆయన ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది. ఈ పాటను లిరిసిస్ట్ చంద్రబోస్ రాశారు.. లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.. అయితే సాంగ్ లో బన్నీ గాజు గ్లాస్ ను పట్టుకొని స్టెప్పులు వేస్తాడు.. గ్లాస్ చూపిస్తూ వేసిన స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ పాట చివరిలో టీ గ్లాస్ పట్టుకొని బన్నీ స్టైలిష్‌గా స్టెప్పులేశాడు. అసలే ఎన్నికల టైమ్.. పైగా జనసేన గుర్తు గాజు గ్లాస్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కింద తెగ కామెంట్లు పెడుతున్నారు. మొన్నే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్‌లో గాజు గ్లాసు డైలాగ్ పెట్టి హరీష్ శంకర్ గట్టిగానే రచ్చ లేపారు. ఈసారి బన్నీ గాజు గ్లాసు పట్టుకొని స్టెప్పులేసి జనసేన తరపున ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.. జనసేన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని పవన్ ఒకవైపు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా సినిమాలతో ప్రచారం చెయ్యడం పై రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.. జనసేన గుర్తును స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.. మరి ఈ వివాదాల పై పుష్ప టీమ్ ఎలా సమాధానం చెప్తుందో చూడాలి..