NTV Telugu Site icon

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా కన్ఫార్మ్.. పోస్టర్ లుక్ అదిరిందిగా..

Allutrivikram

Allutrivikram

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో పాన్ లెవల్ లో క్రేజ్ ను అందుకున్నాడు.. ఈ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సర్ ప్రైజ్ గా టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది… పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

అలాగే మరో సినిమాను ప్రకటించారు.. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడో అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్, బోయపాటి.. ఇలా పలువురు దర్శకుల పేర్లు వినపడ్డాయి. ఈ డైరెక్టర్లతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.. అందులోనూ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ తో మరో సినిమా చెయ్యనున్నాడనే వార్తలు కాస్త ఎక్కువగా వినిపించేవి..

ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది.. త్రివిక్రమ్ దర్శకత్వం లో బన్నీ తదుపరి సినిమా చెయ్యబోతున్నాడు.. ఆ సినిమాను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో చినబాబు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇప్పుడు వస్తున్న నాలుగో సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోబోతుందని ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది..

Show comments