Site icon NTV Telugu

Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!

Allu Arjun Raaka Movie Updates,

Allu Arjun Raaka Movie Updates,

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రాకా’. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, ఆమె రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడంతో, ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని లేదా ఆమె స్థానంలో మరో హీరోయిన్ వస్తుందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై ‘రాకా’ టీమ్ ఘాటుగా స్పందించింది.

Also Read :Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్..!

ఈ మూవీ నుండి దీపికా పదుకొణె తప్పుకున్నారనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకమని, స్ర్కీన్ స్పేస్ తగ్గించారనే ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చేప్పింది. షూటింగ్ అంతా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే సాగుతోందని, అనవసరమైన రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆమె ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో దీపికాతో పాటు మరికొందరు టాప్ హీరోయిన్లు కూడా కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు అతిథి పాత్రల్లో కనిపిస్తారా లేక పూర్తి స్థాయి పాత్రలా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు, ఈ సినిమా లుక్ కోసం అల్లు అర్జున్ రోజుకు 3 నుండి 4 గంటల పాటు మేకప్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం సమయం కేటాయిస్తుండటం గమనార్హం.

Exit mobile version