Site icon NTV Telugu

Allu Aravind: ఖరీదైన కారును కొన్న అల్లు అరవింద్.. ధర ఎంతంటే?

Allu Aravind

Allu Aravind

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఈయన ఒకడు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్నాడు.. అల్లు అరవింద్ తాజాగా ఖరీదైన కారును కొన్నాడు.. ఇప్పటికే తన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఇప్పుడు మరో లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు.. ఆ కారు చూడటానికి చాలా అందంగా ఉండటం మాత్రమే కాదు షైనింగ్ కలర్ లో అదిరిపోయే లుక్ తో పాటుగా అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉంది.. ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ద్వారా ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలను అందించాడు..

ఇకపోతే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు.. ఇక తన కుమారుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. గతంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా ఆగస్టు 15 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..

Exit mobile version