NTV Telugu Site icon

Mohammed Siraj: క్రికెట‌ర్ మ‌హ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం కేటాయింపు..

Siraj

Siraj

క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ.. ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. టీ20 ప్రపంచకప్‌ భారత్‌ జట్టు టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ప్రపంచకప్లో టీమిండియా సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా.. టైటిల్ గెలుకుని స్వదేశానికి వచ్చిన సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశాడు. ఆయనకు టీమిండియా జెర్సీని కూడా బహుకరించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ క్రమంలో.. మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు.. సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయించింది. టీమిండియాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆడుతున్న ఏకైక ఆటగాడు మహ్మద్ సిరాజ్..

Read Also: Deputy CM Pawan Kalyan: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారీగా నిధుల పెంపు.. ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పిలుపు..

ప్రపంచకప్‌లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మనోడికి చోటు దక్కలేదు. దాయాది పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.

Show comments