Site icon NTV Telugu

GVMC Mayor: విశాఖ గ్రేటర్‌ మేయర్‌ పీఠంపై పట్టుబిగిస్తున్న కూటమి..

Gvmc

Gvmc

విశాఖ గ్రేటర్‌ మేయర్‌ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టుబిగిస్తోంది.. మ్యాజిక్‌ ఫిగర్‌ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి 74వ వార్డు కార్పొరేటర్‌ వంశీరెడ్డి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారింది అవిశ్వాసం ఓటింగ్‌. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది.

Also Read:Pawan Kalyan: కష్ట సమయంలో ప్రధాని మోడీ స్పందన మరువలేనిది

వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, మరో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరం అవుతుంది. ఇవాళ కూటమి ఎమ్మెల్యేలు కీలక సమావేశం కానున్నారు. ఇప్పటికే విదేశాల్లో వైసీపీ, టీడీపీ శిబిరాలు ఏర్పాటు చేశాయి. కానీ, ఇరు వర్గాల నుంచి పూర్తిస్థాయిలో క్యాంప్ లకు కార్పోరేటర్లు వెళ్లడం లేదు. ఓటింగ్ కు వెళ్లాలా.. వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీకి వదిలేసింది సీపీఐ.

Exit mobile version