Site icon NTV Telugu

Aa Okkati Adakkau : సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ కామెడి మూవీ..

Whatsapp Image 2024 04 30 At 10.06.36 Am

Whatsapp Image 2024 04 30 At 10.06.36 Am

టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు కామెడీ సినిమాలతో తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అల్లరి నరేష్ ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు .దీనితో కామెడీ జోనర్ ని వదిలి యాక్షన్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.నాంది ,ఉగ్రం వంటి యాక్షన్ సినిమాలతో అల్లరినరేష్ ఎంతగానో మెప్పించాడు.అలాగే స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించాడు.దీనితో నరేష్ ఇక కామెడీ సినిమాలు పక్కన పెట్టేసినట్లే అని అంత భావించారు.కానీ నరేష్ రూటు మార్చి తనకు ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్ మూవీలో నటించాడు.అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు”..మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో హర్ష మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు .ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్ రైటర్‌గా పని చేసారు . అలాగే ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు .మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది .ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.

పెళ్లి అనేది ఓ ఎమోషన్ కొందరు ఆ ఎమోషన్స్‌ను ఎలా క్యాష్ చేసుకుంటున్నారు వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది.పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ మూవీలో మేకర్స్ చూపించే ప్రయత్నం చేసారు.నిజానికి పెళ్లి గురించి అందరూ చాలా తేలిగ్గా అడుగుతారు .కానీ ఆ వ్యక్తితో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్‌ను ఈ మూవీలో మేకర్స్ ఎంటర్‌టైనింగ్‌గా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ క్యారక్టరైజేషన్ మరియు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయని మేకర్స్ తెలిపారు..ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది .సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు .అలాగే ఈ సినిమా రన్నింగ్ టైం 2 గంటల 14 నిముషాలు ఉన్నట్లు మేకర్స్ తెలియజేసారు.

Exit mobile version