NTV Telugu Site icon

Bachhala Malli : సరికొత్త కథాంశంతో వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి..

Whatsapp Image 2024 03 19 At 3.21.08 Pm

Whatsapp Image 2024 03 19 At 3.21.08 Pm

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి.. ఈ మూవీలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భం గా బచ్చలమల్లి సినిమాతోపాటు సందీప్ కిషన్ మరియు అల్లరి నరేష్ సినిమాల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాత గా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాత గా ఉందని ఆయన అన్నారు.స్వామిరారా చిత్రం తో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలైందని ఆయన అన్నారు. అక్కడి నుంచి దాదాపు 82 సినిమాలను విడుదల చేశాను.ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశాను.

అనిల్ సుంకర తో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవకోన, సామజవరగమన వంటి సినిమాలను నిర్మించాను . అవి హిట్ కావడంతో ఈ బర్త్ డే గిఫ్ట్‌గా మరో కొన్నిసినిమాలు సిద్ధం చేసుకున్నాను.నేను ఇంతకుముందు కూడా చేసినవి స్వంత బ్యానర్‌ లోనే. నాకు ఇష్టమైన వారితో నా బ్యానర్‌ లో చేయడం నాకు చాలా హ్యాపీగా వుంది.. నాంది సినిమా నా జోనర్ సినిమా అలాగే బచ్చల మల్లి కూడా నా జోనర్ సినిమా. ఇలా నాకు ఇష్టమైన కథలతో, మనుషుల తో చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి సుబ్బు దర్శకుడు.బచ్చల మల్లి 90 దశకం లోని కథ. చాలా ఆసక్తికరం గా ఉంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్ల లో తీయాలని అన్నవరం మరియు తుని చుట్టు పక్కల విలేజ్‌లలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే సింగిల్ షెడ్యూల్‌ లో సినిమా పూర్తి చేస్తాం. సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని ఆయన తెలిపారు.