NTV Telugu Site icon

Ap Police Constable Exam: రేపే ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. అభ్యర్థులకు కొన్ని సూచనలు

Constable

Constable

ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరగనుంది. 6100 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ కానిస్టేబుల్ పరీక్ష కు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు.

* ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష ఉ.10 గంటల నుంచి మ. 1 వరకు జరుగుతుంది.

* ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లవచ్చు. ఉదయం 10 గం. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

* అభ్యర్థులు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్,నోట్స్ వంటి వాటికి నో ఎంట్రీ

* అభ్యర్థులు తమ హాల్ టికెట్, పెన్, ఆధార్ కార్డు/రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలి. పరీక్ష రాసేందుకు బ్లూ/బ్లాక్ పాయింట్ ని మాత్రమే వాడాలి

* ఇవ్వబడిన నిర్దిష్ట సమయంలో 200 ప్రశ్నలకు సమాధానం రాయాలి. అభ్యర్థి సమయపాలన పాటించాలి. లేకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం

* అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులను రిక్రూట్మెంట్ బోర్డు వారు కేటాయించారు.

* పరీక్షాపత్రంలో 200 మార్కులు, 200 ప్రశ్నలు ఉంటాయి, సమయం 180 నిముషాలు (3 గంటలు)

* ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే అభ్యర్థి ఒక ప్లానింగ్ తో వుండాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే 49 సెకన్ల టైం ఉంటుంది.

* విద్యార్థి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ప్రశ్న చదవడం, ప్రశ్న చదివి అర్ధం చేసుకుని, సమాధానం గుర్తించాలి. OMR షీట్ పైన Bubble చేయాలి.

* ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల్లో కొన్ని కఠినమైన ప్రశ్నలు, కొన్ని సులభమైన ప్రశ్నలు ఉంటాయి. విద్యార్ధులు ప్రశ్నలు చదివి బాగా వచ్చిన ప్రశ్నలకు తొలుత సమాధానం గుర్తించాలి.

* గంటన్నర సమయంలో 1 నుండి 200 వరకు సులభమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. 100 నుండి 150 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

* తర్వాత గంట సమయంలో 60 ప్రశ్నలకు సమాధానం చేయాలి. అతికష్టమైన ప్రశ్నలకు మిగిలిన టైం కేటాయించడం ముఖ్యం.

* విద్యార్థి 200 ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వాలి. నెగిటివ్ మార్క్స్ లేకపోవడంతో విద్యార్థి అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడం అవసరం.

* కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యేవారు వత్తిడికి గురికాకూడదు. ఒక రోజు ముందు రాత్రి బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. ఓఎంఆర్ షీట్స్ అన్నీ సరిగా రాశామో లేదో చెక్ చేసుకోవాలి. పరీక్ష బాగా రాయండి.. ఆల్ ది బెస్ట్

Show comments