NTV Telugu Site icon

NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో అలియాభట్..?

Ntr31 (1)

Ntr31 (1)

NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర” ఈ సినిమాను టాలీవుడ్ మాస్ దర్శకుడు
కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది,బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మేకర్స్ ఇటీవల ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.

Read Also :Anasuya Bharadwaj : టీవీ షోలో మెరిసిన అనసూయ.. మళ్లీ యాంకరింగ్ చేస్తుందా?

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు.ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు “డ్రాగన్ ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.డ్రాగన్ అంటే యూరోపియన్ సంస్కృతిలో చెడుకి గుర్తు అని అర్ధం.అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక రాక్షసుడిలా ఎంతో వైల్డ్ గా కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు.

Show comments