బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు.
READ MORE: Gangamma Jaatara: అంగరంగ వైభవంగా ప్రారంభమైన అనంతపురం గంగమ్మ తల్లి జాతర
ఆలియా భట్- రణబీర్ కపూర్ ల ముద్దుల కూతురు రియా పాపరాజ్జీ. రియా ఫొటోలు అలియా సోషల్ మీడియాలో పంచుకుంటుండేది. తాజాగా తొలగించడం రెడ్డిట్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సోషల్ మీడియా యూజర్స్ స్పందిస్తున్నారు. “నేను ఆమె నిర్ణయాన్ని 100% సమర్థిస్తున్నాను. వాస్తవానికి నేను అలియా అభిమానిని కాదు. ఆమెను చాలా సార్లు విమర్శించాను. కానీ ఈ విషయంతో సమర్తిస్తున్నాను. ఎందుకంటే.. ఇంటర్నెట్ లో చాలా మంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. తల్లిదండ్రులుగా.. వారు తమ కూతురిని రక్షించుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సరైంది.” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్, జెహ్ కు పై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలియా భట్ ను కదిలించింది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రియా గోప్యత చాలా అవసరమని భావిస్తున్నారు. ఈ కారణాల వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు.
READ MORE: Amitabh Bachchan:1990ల్లోనే అమితాబ్ బచ్చన్‌పై 55 కేసులు, 90 కోట్ల అప్పులు.. ఎలా అధిగమించారు?