Site icon NTV Telugu

Naatu Naatu Song : నాటు నాటు సాంగ్‌ కు ఆలియా భట్, రష్మిక స్టెప్పులు

Natu Natu Song Dance

Natu Natu Song Dance

ముంబాయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా ఆదే స్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్ చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు స్టెప్పులతో అదరగొట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ గా మారింది.

Also Read : Summer Holidays: హమ్మయ్య.. సెలవులు వచ్చేశాయోచ్చ్‌..

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్ ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్ లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైప్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Religious Clash : మహారాష్ట్రలో మత ఘర్షణలు.. జల్గావ్ లో ఉద్రిక్తత

ఆలియా భట్, రష్మిక మందాన చేసిన డ్యాన్స్ కు నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఇలా కలిసి చేయడం సంతోషంగా ఉందంటూ విభిన్న రకాల కామెంట్స్ చేస్తున్నారు. సౌత్, నార్త్ హీరోయిన్స్ ఒకే ఈవెంట్ లో డ్యాన్స్ చేశారంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version