NTV Telugu Site icon

Alia Bhatt: ఆస్పత్రిలో చేరిన ఆలియా భట్.. ఆందోళనలో ఫ్యాన్స్

Aliya Butt

Aliya Butt

Alia Bhatt: ట్రిపుల్ఆర్ ఫేం ఆలియా భట్ ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. మరికొద్ది గంట్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్. రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంట ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఒక్కటైయారు. అంతేకాదు పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులకు ఆలియా శుభవార్త చెప్పింది. ఇక్కడ విశేషం ఏమంటే ఆలియా ప్రెగ్నెంట్ తర్వాత కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తన ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ రాకుండా కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాలు చేస్తోందని తెలుస్తోంది.

Read Also: RRR Record Collections: జపాన్‎లో రికార్డు వసూళ్లు రాబట్టుతున్న ట్రిపుల్ఆర్ మూవీ.. మొత్తం కోట్లంటే

ఆలియా భట్ తన తండ్రి దర్శక, నిర్మాత మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ఆ తర్వాత ‘డియర్ జిందగీ, ‘హైవే’, ‘రాజీ’ మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆలియా భట్.. హలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ ఈ మధ్యే పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ను పోర్చుగల్‌లో చేశారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడోట్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. ఇటీవల బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్లో కూడా ఆలియా తన భర్తతో కలిసి పాల్గొంది. బేబీ బంప్‌తో తిరుగుతూ హల్ చల్ చేసింది. అయితే తాజాగా ఆలియా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆలియా భర్తతో కలిసి డెలివరీ కోసం రిలయన్స్ ఆస్పత్రికి వెళ్లనుంది. అయితే ఈ క్రమంలో ఆలియా, రణ్‌బీర్ కపూర్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వీరిద్దరు మరికొన్ని గంటల్లో తమ బిడ్డకు ఈ లోకంలో వెల్కమ్ చెబుతారని సమాచారం. దీంతో బాలీవుడ్ అంతా ఈ బిడ్డ కోసం ఆశగా ఎదురు చూస్తుంది.

Show comments