Site icon NTV Telugu

Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో దేశంలో ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఖమేనీ మరణవార్తను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించాయి. అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న అంశం ఖమేనీ మిగిల్చిన అపారమైన సంపద ఎంత అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Trisha: విజయ్ విడాకుల రచ్చ..‘నచ్చిన వాడితో ఉంటా’ అంటూ త్రిష షాకింగ్ కామెంట్స్!

ఖమేనీ నికర విలువ ఎంత?
ముప్పై ఏళ్లకు పైగా ఇరాన్‌ను శాసించిన ఖమేనీ, వ్యక్తిగతంగా సాధారణ జీవితం గడుపుతున్నట్లు కనిపించినా, ఆయన నియంత్రణలో ఉన్న ఆర్థిక సామ్రాజ్యం విస్తుపోయేలా ఉంది. పలు నివేదికల ప్రకారం.. ‘సెటాడ్’ (Setad) వంటి శక్తివంతమైన సంస్థల ద్వారా ఖమేనీ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని శాసించారు. జప్తు చేసిన ఆస్తులు, భారీ పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలపై ఆయనకు ఉన్న పట్టుతో $95 బిలియన్ల నుంచి $200 బిలియన్ల సంపద కూడబెట్టారని అంచనా. 1989 నుండి సుప్రీం లీడర్‌గా ఉన్న ఆయన, అణు కార్యక్రమాలు, ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాలు, అంతర్గత గందరగోళాల మధ్య కూడా దేశ ఆర్థిక మూలాలను తన గుప్పిట్లో ఉంచుకున్నారు.

ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా..
గణాంకాలను పరిశీలిస్తే, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నేతల కంటే ఖమేనీ సంపద ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. ఫోర్బ్స్ ప్రకారం 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ నికర విలువ $7.3 బిలియన్లకు పెరిగింది. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రధాని నికర విలువ సుమారు $13 మిలియన్లు మాత్రమే అని సమాచారం. ఈ లెక్కన చూస్తే, ట్రంప్, నెతన్యాహు సంపదను కలిపినా ఖమేనీ నియంత్రణలో ఉన్న నిధుల దరిదాపుల్లోకి కూడా రావుని చెబుతున్నారు.

READ ALSO: Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు.. ఎవరీ మోజ్తబా ఖమేనీ!

Exit mobile version