NTV Telugu Site icon

BSF Recruitment 2024: అలర్ట్.. భారత సైన్యంలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

New Project (25)

New Project (25)

సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అనేక గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. BSF ఈ రిక్రూట్‌మెంట్ కోసం 10th, 12th పాస్ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.inని సందర్శించి దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులకు 30 జూన్ 2024 చివరి తేదీ అని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

READ MORE: Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కిపు ఇలా..

BSF రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు ఇలా..
SI (మాస్టర్): 7 పోస్టులు
SI (ఇంజిన్ డ్రైవర్): 4 పోస్టులు
HC (మాస్టర్): 35 పోస్టులు
HC (ఇంజిన్ డ్రైవర్): 57 పోస్టులు
HC (వర్క్‌షాప్) మెకానిక్ (డీజిల్/పెట్రోల్ ఇంజన్): 3 పోస్టులు
HC (వర్క్‌షాప్) ఎలక్ట్రీషియన్: 3 పోస్ట్‌లు
HC (వర్క్‌షాప్) AC టెక్నీషియన్: 1 పోస్ట్
HC (వర్క్‌షాప్) ఎలక్ట్రానిక్స్: 1 పోస్ట్
HC (వర్క్‌షాప్) మెషినిస్ట్: 1 పోస్ట్
HC (వర్క్‌షాప్) కార్పెంటర్: 3 పోస్ట్‌లు
HC (వర్క్‌షాప్) ప్లంబర్: 2 పోస్ట్‌లు
కానిస్టేబుల్ (క్రూ): 45 పోస్టులు

READ MORE: Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం

వయో పరిమితి ఇదే..
SI (మాస్టర్), SI (ఇంజిన్ డ్రైవర్) పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. జూలై 1, 1996, జూలై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి. హెచ్‌సి (మాస్టర్), హెచ్‌సి (ఇంజిన్ డ్రైవర్), హెచ్‌సి (వర్క్‌షాప్), కానిస్టేబుల్ (క్రూ) పోస్టులకు అభ్యర్థి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు జూలై 1, 1999, జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం.. అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ/తరగతి 12వ/ITI/గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. BSF గ్రూప్ B పోస్టులకు.. అభ్యర్థులు 200 రూపాయలు, గ్రూప్ C పోస్టులకు అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళా కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.