NTV Telugu Site icon

Alcatel V3 Series: 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన ధరలతో అల్కాటెల్ V3 అల్ట్రా, ప్రో, క్లాసిక్ మొబైల్స్ లాంచ్..!

Alcatel V3

Alcatel V3

Alcatel V3 Series: అల్కాటెల్ ఇండియా, NXTCell భాగస్వామ్యంతో భారత్‌ లో V3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Alcatel V3 Ultra 5G, V3 Pro 5G, V3 Classic 5G మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా V3 Ultra, V3 Pro మోడల్స్‌లో 120Hz NXTPAPER యాంటీ గ్లేర్ డిస్‌ప్లే మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. అలాగే NXTPAPER INK మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ను అందించారు. ఇది ఈ-బుక్‌లను చదవడానికి అనువుగా ఉండే విధంగా, ఒక బటన్‌తో ఎలక్ట్రానిక్ పేపర్ తరహా అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఈ ఫోన్లకు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, యాంటీ-రెఫ్లెక్టివ్ కోటింగ్ ఉండడంతో కళ్లకు ఇబ్బందికరంగా ఉండదు. Max Ink Mode ద్వారా 7 రోజుల వరకు రీడింగ్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది. మరి ఇన్ని ఫీచర్లను తీసుక వచ్చిన అల్కాటెల్ ఏ ఫోన్ లో అలంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను అందించిందో వివరంగా చూద్దామా..

Read Also: Water Proof vs Resistant: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య తేడా ఏంటో తెలుసా..?

Alcatel V3 Ultra 5G:
డిస్‌ప్లే: 6.8-అంగుళాల FHD+ (120Hz, NXTPAPER, 650 nits)

ప్రాసెసర్: Dimensity 6300 (6nm)

ర్యామ్ & స్టోరేజ్: 6GB/8GB + 128GB, 2TB వరకు microSD

కెమెరాలు: 108MP + 8MP + 2MP (వెనుక), 32MP (ఫ్రంట్)

OS: Android 14 (Android 15 అప్‌డేట్ త్వరలో)

బ్యాటరీ: 5010mAh, 33W ఫాస్ట్ ఛార్జింగ్

ధర: 6GB వేరియంట్ రూ.19,999, 8GB వేరియంట్ రూ. 21,999.

Image

Read Also: Suryakumar Yadav: 15 ఏళ్ల రికార్డు బద్దలు.. క్రికెట్ గాడ్ రికార్డుకు చెక్‌మేట్ చెప్పిన సూరీడు..!

Alcatel V3 Pro 5G:
డిస్‌ప్లే: 6.7-అంగుళాల HD+ (120Hz NXTPAPER)

ప్రాసెసర్: Dimensity 6300

ర్యామ్ & స్టోరేజ్: 8GB + 256GB

కెమెరాలు: 50MP + 5MP (వెనుక), 8MP (ఫ్రంట్)

OS: Android 15

బ్యాటరీ: 5200mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్

ధర: రూ. 17,999.

Alcatel V3 Classic 5G:
డిస్‌ప్లే: 6.7-అంగుళాల HD+ LCD (120Hz)

ప్రాసెసర్: Dimensity 6300

ర్యామ్ & స్టోరేజ్: 4GB/6GB + 128GB

కెమెరాలు: 50MP + 0.08MP (వెనుక), 8MP (ఫ్రంట్)

OS: Android 15

బ్యాటరీ: 5200mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్

ధర: 4GB వేరియంట్ రూ.12,999, 6GB వేరియంట్ రూ. 14,999.

ఇక అన్ని మోడల్స్‌లో కామన్ అదనపు ఫీచర్ల విషయానికి వస్తే.. IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ లతోపాటు.. స్టెరియో స్పీకర్లు, NFC, 3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.3, GPS లను అందించనున్నారు. ఇక ఈ ఫోన్లు జూన్ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌ కార్ట్ లో అందుబాటులో ఉంటాయి. రిటైల్ స్టోర్‌ లలో త్వరలోనే విక్రయాలు ప్రారంభం అవుతాయి. ఇక లాంచ్ ఆఫర్ల కింద V3 Ultra, Pro పై రూ.2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ (Axis, ICICI, SBI, HDFC కార్డులపై) లేదా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అలాగే V3 Classic పై రూ.1000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అలాగే 3 నెలల వరకు నో-కాస్ట్ EMI లభిస్తుంది. మొత్తంగా ఈ ధరలలో ఇలాంటి ఫీచర్లు అందించడం వల్ల Alcatel V3 సిరీస్ బడ్జెట్, మిడ్-రేంజ్ వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా నిలవనుంది.