Site icon NTV Telugu

Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?

07

07

Alaska sale history: ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు అలస్కాపై ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రెండు అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలు అలస్కాలో సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో ప్రపంచం దృష్టి అలస్కావైకు మళ్లింది. అమెరికాకు చెందిన ప్రాంతంగా అలస్కా నేటి ప్రపంచానికి తెలుసు. కానీ ఈ ప్రాంతం ఒకప్పుడు రష్యాకు చెందినది అనే విషయం ఎంత మందికి తెలుసు. అసలు ఈ ప్రాంతాన్ని రష్యా అమెరికాకు ఎందుకు అమ్మింది.. ఎంతకు అమ్మిందనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ MORE: Minister Savitha: ఎన్డీయే కూటమి కృషితో పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యం అంతమైంది..

1867 మార్చి 30న అలాస్కా అమ్మకం..
పద్దెనిమిదవ శతాబ్దంలో రష్యన్ సామ్రాజ్యం సైబీరియా దాటి విస్తరించింది. 1741లో రష్యన్ అన్వేషకుడు విటస్ బెరింగ్ మొదటిసారి అలాస్కాకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ జంతువు చర్మాల వ్యాపారం ప్రారంభమైంది. రష్యన్ వ్యాపారులు సీల్స్, ఓటర్స్, ఇతర జంతువుల చర్మాల కోసం ఇక్కడకు వచ్చారు. ఆ తర్వాత కాలక్రమంలో ఇది రష్యాన్‌ల ఏలుబడిలోకి వచ్చింది. తర్వాత అలాస్కా రాజధానిగా సిట్కా మారింది. కానీ అలాస్కా రష్యాకు దూరంగా ఉంది. సంక్షోభం వచ్చినప్పుడల్లా సహాయం రావడానికి నెలల తరబడి పట్టింది. 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో బ్రిటిష్ నావికాదళం రష్యన్ స్థావరాలపై దాడి చేసింది. ఆ సమయంలో రష్యా దూరంలోని ఈ మారుమూల ప్రాంతాన్ని నిర్వహించడం అంత సులభం కాదని గ్రహించింది. అప్పుడు రష్యన్ జార్ అలెగ్జాండర్ II ముందు ఒక పెద్ద సందిగ్ధత తలెత్తింది.

ఒకవైపు బ్రిటన్ భయం, ఖజానా ఖాళీ కావడం, పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా రష్యా అలస్కాను అమ్మాలని అనుకుంది. ఈక్రమంలో 1867 మార్చి 30న రష్యా – అమెరికా మధ్య రాత్రికి రాత్రే ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో రష్యా 15 లక్షల 70 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అమెరికాకు కేవలం 72 లక్షల డాలర్లకు విక్రయించింది.

పాపం రష్యా.. దాచిన నిధిని వదులుకుంది
కానీ కొన్ని సంవత్సరాలలో అలాస్కా బంగారు గనిగా మారుతుందని అప్పుడు రష్యాకు తెలియదు. 1896లో క్లోన్డికే గోల్డ్ రష్ ఇక్కడ వేలాది మందిని ఆకర్షించింది. తరువాత 20వ శతాబ్దంలో ఇక్కడ చమురు, గ్యాస్ నిల్వలు గుర్తించారు. నేడు అలాస్కా అమెరికాలో అతిపెద్ద ఇంధన నిల్వల వనరుగా ఉంది. ఇది కేవలం ఖనిజాలకే ప్రసిద్ధి కాకుండా భౌగోళిక స్థావరంగా ప్రముఖంగా మారింది. ఇది అమెరికా, రష్యా నుంచి కేవలం 85 కి.మీ దూరంలో ఉంది.

ట్రంప్-పుతిన్ సమావేశం:
ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఈ ఇద్దరు దేశాధినేతలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో చర్చించనున్నారు. ట్రంప్ – పుతిన్ సమావేశం కేవలం ఒక అధికారిక సమావేశం మాత్రమే కాదు. అమెరికా-రష్యా సంబంధాలలో కొత్త మలుపు తీసుకువచ్చేదిగా మొత్తం ప్రపంచానికి ఒక సంకేతం ఇస్తుంది. ఈ సమావేశానికి అలాస్కా ఎంపిక కేవలం ఒక ప్రదేశం కాదు, వ్యూహాత్మక సందేశంగా నిపుణులు చర్చించుకుంటున్నారు.

READ MORE: Veer Chakra winners: ఆపరేషన్ సింధూర్ హీరోలకు మెడల్స్…

Exit mobile version