Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshaye Khanna: బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “నిజమైన ప్రతిభకు శబ్దం అవసరం లేదు.. అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఒక క్లాస్‌గా ఉంటాయి” అని ప్రశాంత్ వర్మ కొనియాడారు. కేవలం శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, తమ ఇద్దరి కలయికలో రాబోతున్న కొత్త కంటెంట్‌ను ప్రపంచానికి చూపించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఈ సందర్భంగా ఆయన #Mahakali సెట్స్ నుంచి అక్షయ్ ఖన్నాకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా ‘అసుర గురువు శుక్రాచార్య’గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
READ ALSO: Samantha: పెళ్లి తర్వాత సమంతలో కొత్త కళ?
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
‘హనుమాన్’ సినిమాతో నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) లో భాగంగా వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. తాజా సమాచారం ప్రకారం, అక్షయ్ ఖన్నా ప్రశాంత్ వర్మ బ్యానర్‌లో రూపొందుతున్న మూడు కీలక చిత్రాల్లో భాగం కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో శక్తివంతమైన ఫీమేల్ సెంట్రిక్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న మహాకాళి చిత్రం ఒకటి కాగా, అదిరిపోయే సూపర్ హీరో థీమ్‌తో తెరకెక్కుతున్న అధిర, జై హనుమాన్ చిత్రాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న మైథాలజీ యాక్షన్ డ్రామా జై హనుమాన్. ఈ మూడు సినిమాల్లో అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఫోటోలో అక్షయ్ ఖన్నా చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండటం ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తోంది.
‘మహాకాళి’ చిత్రం ఇప్పటికే 100 రోజుల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సినిమాకు సంబంధించి చివరిదైన 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా నటిస్తున్న అక్షయ్ ఖన్నా పాత్ర కథలో అత్యంత కీలకమైన మలుపుగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మల్టీ-స్టూడియో ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మెగా సినిమాటిక్ వండర్ విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం PVCUలో మొదటి ఫిమేల్ సూపర్ హీరో మూవీగా రాబోతోంది. భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన పూర్తి దృష్టిని జై హనుమాన్ చిత్రంపై పెట్టారు. ఇందులో అక్షయ్ ఖన్నా పాత్ర ఉంటుందా, ఉంటే ఎలా ఉండబోతోంది? ఆయన విలన్‌గా కనిపిస్తారా లేదా ఏదైనా పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.
Happy Birthday #AkshayeKhanna sir, a true actor who proves that real talent doesn't need noise. Effortless screen presence, powerful performances, and unmatched class always stand out 🎭🎬
Its an absolute honour working with you. Can’t wait to show the world what we’ve created… pic.twitter.com/xiblaH8voc
— Prasanth Varma (@PrasanthVarma) March 28, 2026
READ ALSO: Russia : ప్రపంచ దేశాలకు రష్యా ‘పెట్రో’ షాక్.. ఏప్రిల్ 1 నుంచి ఎగుమతులు బంద్!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!