NTV Telugu Site icon

Akshay Kumar: శిఖర్ దావన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన అక్షయ్ కుమార్.. వీడియో వైరల్..

Akshay

Akshay

బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో కనిపించాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అక్షయ్,టైగర్‌ ష్రాఫ్‌ తో కలిసి నటిస్తున్న సినిమా బడే మియాన్‌ చోటే మియాన్‌.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.. ఈ క్రమంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇకపోతే బడే మియాన్ చోటే మియాన్’ నుంచి రిలీజ్‌ అయిన ‘మస్త్ మలాంగ్ ఝూమ్ పాటకు డ్యాన్స్ చెయ్యాలని కోరగా.. ఇద్దరు కలిసి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.. ప్రముఖ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తో కలిసి ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్‌ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత సహ నటులు సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్‌, అలయ ఎఫ్‌తోపాటు స్టార్‌ నటి కత్రినా కైఫ్‌కు కూడా ఈ ఛాలెంజ్‌ విసిరాడు..

కాగా,మస్త్ మలాంగ్ ఝూమ్’ సాంగ్ ను తాజాగా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా నటించిన ఈ పాట ఆకట్టుకునే బీట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే పాట మధ్యలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు హుక్ స్టెప్పును రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..