Lenin : లెనిన్ గ్లిమ్స్.. స్లాంగ్ ఎక్కడో తేడా కొడుతుంది అయ్యగారు

Akhil

Akhil

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఈ టీజర్‌లో అఖిల్‌ను సరికొత్త విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో చూడటం ఫ్యాన్స్‌కు చాలా ఫ్రెష్‌గా అనిపించినప్పటికీ, ఓవరాల్ లుక్ మరియు కొన్ని టెక్నీకల్ అంశాలపై మాత్రం  కాస్త పెదవి విరుస్తున్నారు. సినిమా సెటప్‌కు, అఖిల్ మేకోవర్‌కు ఎక్కడో సింక్ కుదరలేదనే భావన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఈ చిత్రంలో అఖిల్ హెయిర్‌స్టైల్, ఫేస్ కట్ అంతా చిత్తూరు రూరల్ సెటప్‌కు సరిపోలేదని, ఒక పల్లెటూరి కుర్రాడిలా కాకుండా అర్బన్ వైబ్ ఎక్కువగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీనివల్ల కథకు కావాల్సిన సహజమైన ‘రా నెస్’ మిస్ అయిందని మొత్తం లుక్ కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించిందని టాక్ నడుస్తోంది. దీనికి తోడు కొన్ని చోట్ల చిత్తూరు స్లాంగ్   కాస్త బలవంతంగా పలికించినట్లు ఉందని లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా పండలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా టీజర్‌లో డబ్బింగ్ వాయిస్ టెంపరరీగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్షన్ తగ్గిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసలు వాయిస్ అఖిల్ దేనా అనే డౌట్ కూడా వస్తోంది. అయితే టీజర్‌లో వినిపించిన  వాయిస్ అఖిల్ సొంత వాయిస్సేనని కేవలం సౌండ్ మిక్సింగ్ లో తలెత్తిన లోపం వల్లే వాయిస్ అలా డిఫరెంట్‌గా అనిపించిందని ఫైనల్ కట్‌లో అఖిల్ స్వంత వాయిస్ పర్ఫెక్ట్ గా ఉంటుందని యూనిట్ నుండి అందిన సమాచారం. ఈ చిన్న చిన్న లోపాలన్నీ త్వరలో రాబోయే ‘ట్రైలర్’ లో పూర్తిగా ఫిక్స్ అవుతాయని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.