Lenin : లెనిన్ గ్లిమ్స్.. స్లాంగ్ ఎక్కడో తేడా కొడుతుంది అయ్యగారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఈ టీజర్లో అఖిల్‌ను సరికొత్త విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో చూడటం ఫ్యాన్స్‌కు చాలా ఫ్రెష్‌గా అనిపించినప్పటికీ, ఓవరాల్ లుక్ మరియు కొన్ని టెక్నీకల్ అంశాలపై మాత్రం కాస్త పెదవి విరుస్తున్నారు. సినిమా సెటప్‌కు, అఖిల్ మేకోవర్‌కు ఎక్కడో సింక్ కుదరలేదనే భావన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా ఈ చిత్రంలో అఖిల్ హెయిర్‌స్టైల్, ఫేస్ కట్ అంతా చిత్తూరు రూరల్ సెటప్‌కు సరిపోలేదని, ఒక పల్లెటూరి కుర్రాడిలా కాకుండా అర్బన్ వైబ్ ఎక్కువగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీనివల్ల కథకు కావాల్సిన సహజమైన ‘రా నెస్’ మిస్ అయిందని మొత్తం లుక్ కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించిందని టాక్ నడుస్తోంది. దీనికి తోడు కొన్ని చోట్ల చిత్తూరు స్లాంగ్ కాస్త బలవంతంగా పలికించినట్లు ఉందని లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా పండలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా టీజర్లో డబ్బింగ్ వాయిస్ టెంపరరీగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్షన్ తగ్గిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసలు వాయిస్ అఖిల్ దేనా అనే డౌట్ కూడా వస్తోంది. అయితే టీజర్లో వినిపించిన వాయిస్ అఖిల్ సొంత వాయిస్సేనని కేవలం సౌండ్ మిక్సింగ్ లో తలెత్తిన లోపం వల్లే వాయిస్ అలా డిఫరెంట్‌గా అనిపించిందని ఫైనల్ కట్లో అఖిల్ స్వంత వాయిస్ పర్ఫెక్ట్ గా ఉంటుందని యూనిట్ నుండి అందిన సమాచారం. ఈ చిన్న చిన్న లోపాలన్నీ త్వరలో రాబోయే ‘ట్రైలర్’ లో పూర్తిగా ఫిక్స్ అవుతాయని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!