Site icon NTV Telugu

Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్‌లో మార్పులు?

Akhil Lenin

Akhil Lenin

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, పరువు హత్యల వంటి సున్నితమైన అంశం నేపథ్యంలో రాబోతోంది. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా, రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమాతో పోటీని నివారించడానికి మరింత క్వాలిటీ కోసం జూన్ 26, 2026కి వాయిదా పడింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని కీలక మార్పులను సూచించినట్లు ఇండస్ట్రీ టాక్.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ హెల్త్ కండిషన్‌పై డాక్టర్ల కీలక ప్రకటన!

అక్కినేని అభిమానులు అఖిల్ నుంచి ఒక పక్కా కమర్షియల్ హిట్ ఆశిస్తున్నారు. అందుకే నాగ్ స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని సినిమా అవుట్‌పుట్‌ను పరిశీలించారట. సినిమా నిడివి (Run-time) విషయంలో కొన్ని సీన్ల ల్యాగ్ విషయంలో నాగ్ తన అనుభవంతో కొన్ని మార్పులు చేయమని చెప్పినట్లు సమాచారం. ఆ సలహాల మేరకు ఎడిటర్ నవీన్ నూలి కొన్ని అనవసరపు సన్నివేశాలను ట్రిమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేలా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ మరియు ‘ఎట్టా ఎట్టా’ (Yetta Yetta) వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఒక మేజర్ హైలైట్ అని, క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ సీన్లు ఉంటాయని టీమ్ గట్టిగా నమ్ముతోంది.

Exit mobile version