Site icon NTV Telugu

Rahul Khanna: ఖన్నా బ్రదర్ న్యూడ్ ఫోటోషూట్‌తో వైరల్ ..

Rahul Khanna

Rahul Khanna

Rahul Khanna: ప్రస్తుతం భాషాలకు అతీతంగా అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ధురంధర్. ఈ సూపర్ హిట్ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఒకే ఒక పేరు వైరల్‌గా మారింది. ఆ పేరే అక్షయ్ ఖన్నా. ఈ చిత్రంలో హీరో రణవీర్ సింగ్, కానీ నెగటివ్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాకు ఎక్కువగా పేరు వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ ఒక భయంకరమైన నేరస్థుడిగా కనిపించి అలరించాడు. 13 – 14 సంవత్సరాల వయస్సులో నేర ప్రపంచంలోకి ప్రవేశించి వెనక్కి తిరిగి చూడని ఒక ప్రమాదకరమైన వ్యక్తి పాత్రలో జీవించాడు అక్షయ్ ఖన్నా. ప్రస్తుతం ఈ వైరల్ స్టార్ బ్రదర్ న్యూడ్ ఫోటో‌షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఈ వైరల్ విలన్ ఫ్యామిలీ గురించి నెట్టింట జోరుగా సర్చింగ్ జరుగుతుంది. ఇదే సమయంలో అక్షయ్ ఖన్నా అన్నయ్య రాహుల్ ఖన్నా న్యూడ్ ఫోటోలు వైరల్‌గా మారాయి. నిజానికి రాహుల్ కూడా అక్షయ్ లాగానే నటుడు. ఆయన తన కెరీర్‌ను VJ గా ప్రారంభించి, మోడల్‌గా, రచయితగా కూడా పనిచేశాడు. 2022లో రాహుల్ ఖన్నా తన నగ్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ టైంలో తెగ వైరల్‌ అయిన ఈ ఫోటోలు, ప్రస్తుతం కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Exit mobile version