Site icon NTV Telugu

Akhanda2Thandavam : 14వ రోజు అదరగొట్టిన అఖండ – 2.. బాలయ్య తాండవం

Akhanda 2

Akhanda 2

బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం అఖండ 2. భారీ అంచనాల మధ్య ఈ నెల 12 న  విడుదలైన “ఆఖండ 2” సినిమా ఆడీయన్స్ నుండి మంచి స్పందన రాబట్టగా రివ్యూయర్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. అయినప్పటికీ బాలకృష్ణ అద్భుతమైన  అఘోర పాత్ర మరియు బోయపాటి శ్రీను యొక్క మాస్-పాపులర్ బ్లాక్స్ సినిమాను భారీ వసూళ్లు తెచ్చిపెడుతుంది. మేకర్స్ ఈ సినిమాకు ప్రమోషన్లుమాత్రేమే చేసినా కలెక్షన్స్ స్టడీగా రాబడుతూ ట్రేడ్ అని ఆశ్చర్యపరిచింది.

Also Read : HrithikRoshan : కొడుకులతో కలిసి డాన్స్ అదరగొట్టిన హృతిక్ రోషన్.. వీడియో వైరల్

అఖండ 2 రిలీజ్ అయిన 14 రోజుల తర్వాత కూడా, అఖండ2  డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తూనే ఉంది. అందుకు ఉదరహారణ హైదరాబాద్ సిటీ వసూళ్లే. ఈ సినిమా 14వ రోజున హైదరాబాదులో 25 షోలు 70% – 80% ఆక్యుపెన్సీ కనిపించింది. కొన్ని సింగిల్ స్క్రీన్స్ హౌస్ ఫుల్స్ తో నడిచాయి. అటు ఆంధ్రలోను ప్రైమ్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్క్ కు అతి దగ్గరలో ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకున్న కూడా వరల్డ్ వైడ్ గా రూ. 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.  “ఆఖండ 2” లో బాలకృష్ణ అఖోర పాత్రలో చూపించిన ఎనర్జీ, విజువల్ ఫీవర్ మరియు మాస్-ఫ్రెండ్లీ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మీడియా మరియు పబ్లిక్ నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ బాలకృష్ణ, బోయపాటి కాంబో మాస్ ఆడియెన్స్ ని మెప్పించడంలో సూపర్ సక్సస్ అయ్యారు. ‘ఆఖండ 2’  రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబట్టనప్పటికీ సీనియర్ హీరోల లీగ్ లో ప్రస్తుత మార్కెట్ పరంగా బాలయ్య టాప్ లో ఉన్నాడని నిరూపించింది.

Exit mobile version