Site icon NTV Telugu

Akhanda 2: నిర్మాతల మిస్సింగ్.. బాలయ్య-బోయపాటి మౌనం?

Akhanda 2 (2)

Akhanda 2 (2)

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ శుక్రవారం రోజున అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగించుకుని థియేటర్లలో విడుదలైంది. తొలి వారాంతపు కలెక్షన్లు పర్వాలేదనిపించే స్థాయిలో ఉండగా, భారీ లక్ష్యాలను చేరుకోవాలంటే వారం రోజుల పాటు సినిమా స్ట్రాంగ్‌గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ‘అఖండ 2’ సక్సెస్ వేడుకను ఘనంగా నిర్వహించింది. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read :Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?

‘అఖండ 2’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట మరియు గోపీ ఆచంట (14 రీల్స్ ప్లస్) సక్సెస్ మీట్‌కు హాజరు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అదే సమయానికి వారు శ్రీశైలంలో ఉన్నారని తెలిసింది. అయితే ఇదిలా ఉండగా ఈ వేదికపై మాట్లాడిన బాలకృష్ణ కానీ, దర్శకుడు బోయపాటి శ్రీను కానీ తమ ప్రసంగంలో నిర్మాతల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. సినిమా ఆర్థికపరమైన చిక్కుల్లో పడి, విడుదల ఆలస్యం అయినప్పటి నుంచే బాలకృష్ణ మరియు నిర్మాతల మధ్య గ్యాప్ ఏర్పడిందనే వార్తలు వినిపించాయి. సక్సెస్ మీట్‌లో వారిద్దరూ నిర్మాతలను విస్మరించడం ద్వారా, ఆ వార్తలు నిజమేనని స్పష్టమైంది. అంతేకాకుండా, సినిమా విడుదల తర్వాత కూడా బోయపాటి శ్రీను నిర్మాతలతో మాట్లాడటం లేదని సినీ వర్గాల సమాచారం.

Also Read :JINN Trailer : భయపెడుతున్న ‘జిన్’ ట్రైలర్

ఈ సక్సెస్ మీట్ ఖర్చుల విషయంలో కూడా నిర్మాతలతో చర్చ జరగలేదని, ఈ ఈవెంట్‌ను ‘మ్యాంగో రామ్’ దగ్గరుండి నిర్వహించారని కథనాలు వస్తున్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరూ వేదికపై దిల్ రాజు పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా విడుదలకు అడ్డుపడిన అన్ని అడ్డంకులను తొలగించడంలో, చిత్రాన్ని ప్రేక్షకులకు చేర్చడంలో దిల్ రాజు కీలక పాత్ర పోషించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా, ‘అఖండ 2’ విజయాన్ని చిత్ర బృందం ఘనంగా జరుపుకున్నప్పటికీ, తెర వెనుక నెలకొన్న ఈ విభేదాలు, నిర్మాతల మిస్సింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version