Site icon NTV Telugu

Akhanda2: ‘అఖండ 2’ రిలీజ్ అప్పుడేనా.. కోర్టు తీర్పుతోనే బాలయ్య ‘తాండవం’ షురూ..?

Akhanda 2 Thaandavam

Akhanda 2 Thaandavam

Akhanda2: నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ భారీ సీక్వెల్‌కు ఆర్థిక లావాదేవీల రూపంలో అడ్డంకి ఎదురైంది. కోర్టు ఉత్తర్వులు’అఖండ 2′ విడుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల వివాదమే. ఈరోస్ నౌ సంస్థకు చెల్లించాల్సిన దాదాపు 28 కోట్ల నష్టాలను క్లియర్ చేసే వరకు సినిమా విడుదల చేయవద్దని కోరుతూ మద్రాస్ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది.

Akhanda 2-Balakrishna: ఇదెక్కడి పిచ్చిరా మామ.. ‘మాన్షన్ హౌజ్’ మందుతో బాలయ్యకు దిష్టి!

దీంతో పాటు, ఇక్కడ తెలుగులో కూడా ఫైనాన్షియర్లు తమ బకాయిలు చెల్లించాలని పట్టుబట్టడంతో, మొత్తం కలిపి నిర్మాతలు సుమారు 50 కోట్లకు పైగా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ తాత్కాలిక నిషేధం కారణంగానే ‘అఖండ 2’ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఆర్థిక ఇబ్బందులతో రిలీజ్ వాయిదా పడటంతో కంగుతిన్న నిర్మాతల కోసం హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను మానవత్వంతో ముందుకు వచ్చారు. బాలయ్యకు పెండింగ్‌లో ఉన్న రూ. 7 కోట్లు, బోయపాటికి ఇవ్వాల్సిన రూ. 4 కోట్లు రెమ్యునరేషన్‌ను ఈ ఇద్దరు దిగ్గజాలు వదులుకుని నిర్మాతలకు అండగా నిలబడ్డారు.

అలాగే, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా కొంతవరకు హామీగా ఉన్నట్టు సమాచారం.ఈ చర్యల ఫలితంగా 14 రీల్స్ ప్లస్ మేకర్స్ ఈరోస్ నౌతో నెలకొన్న ఆర్థిక లావాదేవీల వ్యవహారాన్ని, అలాగే ఫైనాన్షియర్ల వ్యవహారాన్ని కూడా కొంత డబ్బు చెల్లించి, కొంత తర్వాత ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుని క్లియర్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆర్ధికపరమైన సమస్యలు దాదాపుగా పరిష్కారమైనప్పటికీ, మద్రాస్ హైకోర్టు విధించిన తాత్కాలిక నిషేధం కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో 14 రీల్స్ ప్లస్ మేకర్స్ ఈ రోజు (డిసెంబర్ 5) మద్రాస్ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు.

Akhanda2 : అఖండ 2 వాయిదా.. రెమ్యునరేషన్ వదులుకున్న బాలయ్య – బోయపాటి..

‘అఖండ 2’ రిలీజ్‌కు తమకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. నేడు మద్రాస్ హైకోర్టులో నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వస్తే, ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించి, రేపట్నుంచే (డిసెంబర్ 6, శనివారం) అధికారికంగా సినిమాను విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే, సినిమా విడుదల మరింత ఆలస్యం అవడం ఖాయం. సమస్య పరిష్కారమై వారాంతంలో సినిమా రిలీజ్ అవుతుందా, లేక వాయిదా తప్పదా అని ట్రేడ్ వర్గాలు, ఫ్యాన్స్, థియేటర్ యాజమాన్యాలు ఉత్కంఠగా కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి.

Exit mobile version