Akhanda 2: టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్‌తో ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేడు (డిసెంబర్ 5)న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా వేయడం సినీ లవర్స్‌తో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సాధారణంగా ఏదైనా సినిమా వాయిదా పడితే అభిమానులు నిరాశ చెందుతారు. కానీ, ‘అఖండ 2’ విషయంలో కేవలం నిరాశ మాత్రమే కాదు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాను అన్నీ రాష్ట్రాల్లో ఆర్భాటంగా ప్రమోషన్స్ చేసి, ప్రీమియర్లకు కొద్ది గంటల ముందు (డిసెంబర్ 4 ప్రీమియర్‌ను) టెక్నికల్ ఇష్యూస్ కారణంగా రద్దు చేయడం, ఆపై డిసెంబర్ 5 రిలీజ్‌ను కూడా వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Jio vs Airtel: 28 రోజుల చెల్లుబాటులో ఉన్న బెస్ట్ ప్లాన్ ఏది.. ఎక్కడ ప్రయోజనం పొందుతారంటే..?
అయితే ఈ విషయమై నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ‘అనివార్య పరిస్థితులు’ అంటూ వాయిదా ప్రకటించినా.. అసలు సమస్య మాత్రం ఆర్ధిక లావాదేవీల రూపంలో ఉందని సినీ సర్కిల్స్ టాక్. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్: సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలవ్వడం అనేది బాలయ్య చేతిలో కూడా లేని సమస్య. ఎరోస్ సంస్థ తీసుకువచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ సమస్య కేవలం రూ. 27 కోట్లకు సంబంధించినది కాదని, దానిపై ఆరేళ్ల వడ్డీ కలిపి దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు 14 రీల్స్ సంస్థతో లావాదేవీలు ఉన్న మరికొందరు కూడా తమ అప్పులు తీర్చాలని ఒత్తిడి తీసుకురావడంతో మొత్తం సుమారు 70 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. నిజానికి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ నెలకొంది. అంతటి భారీ ప్రాజెక్ట్‌ను చివరి నిమిషంలో ఇలా వాయిదా వేయడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంచి అభిమానులు వారి అసహానాన్ని సోషల్ మీడియాలో తెలిపారు.
Local Body Elections : నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.. 395 గ్రామాల్లో ఏకగ్రీవం..
ఇందులో చేతకాని ప్లానింగ్.. సింపుల్ రిలీజ్ కూడా మేనేజ్ చేయలేని నిర్మాతలకు ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఏం అవసరమా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరికొందరు బాలయ్య అంత కష్టపడి తాండవం తీశాడు, మీరు మాత్రం చివరి క్షణంలో సినిమాని నాశనం చేసారు అంటూ నిర్మాతలపై బండబూతులు తిడుతూ పోస్టులు చేస్తున్నారు. మరికొందరైతే.. ఏ స్టార్ హీరోకి జరగని స్థాయి అవమానం బాలయ్య సినిమా విషయంలో చోటు చేసుకుంది అంటూ అభిమానులు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
