NTV Telugu Site icon

Balakrishana : “అఖండ 2” పై క్రేజ్ రూమర్ వైరల్..?

Akhanda 2 Jpeg

Akhanda 2 Jpeg

Balakrishana : నందమూరి నట సింహం బాలకృష్ణ,స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన “అఖండ” మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.కరోనా సమయంలో థియేటర్స్ లో సినిమా విడుదల కావడానికి సంకోచిస్తున్న సమయంలో బాలయ్య సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి భారీగా కలెక్షన్స్ సాధించింది.

Read Also :Gangs Of Godavari: ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని దర్శకుడు బోయపాటి గతంలోనే ప్రకటించాడు.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా బాలకృష్ణ 109 వ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమా పూర్తి అయినా వెంటనే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతుంది.తాజాగా “అఖండ 2 ” గురించి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమా మరో 2 నెలల్లో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.షూటింగ్ కోసం అరకు ,కొచ్చి ,లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.దక్షిణ భారత దెస గొప్పతనాన్ని చూపించే సీన్స్ ఈ చిత్రంలో ఉండనున్నట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.