Site icon NTV Telugu

Akhanda2Thaandavam : 3Dలో అఖండ 2.. బోయ – బాలయ్య ప్లానింగ్ వేరే లెవల్ అయ్యా

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ‌’, ‘లెజెండ్’, ‘అఖండ‌’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో అందరికి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తో బాలయ్యతో అఖండకు సీక్వెల్ గా ‘అఖండ‌-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read : AKT : ఆంధ్రకింగ్ తాలుకా ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

కాగా ఈ సినిమా ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు రాబోతున్న అఖండ 2 ను పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరొక బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అఖండ 2 ను 3D ఫార్మేట్ లోను రిలీజ్ చేయనున్నారు. 3D ట్రైలర్ ను ఈ రోజు మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేసారు. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాను రికార్డ్ ధరకుడీల్ క్లోజ్ అయింది. ఇక ఈ సినిమ డిజిటల్ రైట్స్ ను హాట్ స్టార్ అవుట్ రేట్ కు కొనుగోలు చేసింది. అన్ని లాంగ్వేజెస్ రైట్స్ ను రూ. 85 కోట్లకు అమ్ముడయ్యాయి. బాలయ్య సినిమాకు రావడం రికార్డ్ అనే చెప్పాలి. మరికొద్ది రోజుల్లో 3Dలో రాబోతున్న అఖండ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version