Akki On Fire: ఐపీఎల్ 2026లో యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్ (Akash Singh) చేసిన ‘నోట్ సెలబ్రేషన్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన ఆకాశ్ సింగ్.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వికెట్ తీసిన వెంటనే జేబులో నుంచి ఓ నోట్ తీసి చూపించిన సీన్ వీడియో వైరల్ గా మారింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేసింది. అందులో భాగంగా ఆకాశ్ సింగ్‌కు ఈ సీజన్‌లో తొలి అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని అతడు అద్భుతంగా వినియోగించుకున్నాడు.
పవర్ ప్లే లోనే తన ప్రభావాన్ని చూపిన ఆకాశ్ సింగ్.. ముందుగా సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఔట్ చేశాడు. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీతో అతడిని పెవిలియన్ పంపించాడు. వికెట్ తీసిన ఆనందంలో వెంటనే తన జేబులో నుంచి ఓ చిన్న నోట్ బయటకు తీసి కెమెరాలకు చూపించాడు. ఆ నోట్‌పై “#Akki On Fire – Akash knows how to take wickets in T20 game” అని రాసి ఉండటం సంచలనంగా మారింది. ఈ సెలబ్రేషన్ వీడియో ప్రస్తుతం ఐపీఎల్ అభిమానుల మధ్య వైరల్ అయ్యింది. గతంలో ఉర్విల్ పటేల్, రఘు శర్మ కూడా ఇలాంటి ఈ నోట్ సెలబ్రేషన్లు చేయగా.. ఇప్పుడు ఆకాశ్ సింగ్ కూడా అదే జాబితాలో చేరాడు. అక్కడితో ఆగని ఆకాశ్ సింగ్ తర్వాత సంజు శాంసన్ వికెట్ కూడా తీసి తన జట్టుకు మంచి ఆరంభం అందించాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టి తాను ఎందుకు ప్రత్యేక బౌలరో మరోసారి నిరూపించాడు.
రాజస్థాన్‌కు చెందిన ఆకాశ్ సింగ్ అండర్-19 క్రికెట్, దేశీయ టోర్నీల్లో మంచి ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అయిన అతడు కొత్త బంతితో స్వింగ్ చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆకాశ్.. ఇప్పుడు మరో ఫ్రాంచైజీ తరఫున తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌తో పాటు ప్రత్యేక సెలబ్రేషన్ కూడా హైలైట్‌గా నిలిచింది.
#AkashSingh brings the heat & #CSK's openers are back in the dugout! 🔥
PS: Another note makes an appearance in the celebrations! 📝#TATAIPL Race To Playoffs 2026 ➡️ #LSGvCSK | LIVE NOW 👉 https://t.co/5Mr0NV7vdi pic.twitter.com/z63rfZaJUh
— Star Sports (@StarSportsIndia) May 15, 2026
