Site icon NTV Telugu

Akash Deep: ఈ మ్యాచ్‌ ఆమెకే అంకితం.. ఎమోషనలైన సంచలన బౌలర్..!

Akash Deep

Akash Deep

Akash Deep: ఎడ్జ్ బస్టన్ టెస్ట్‌లో భారత్ ఇంగ్లాండ్‌ ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.. అంతేకాదు భారత జట్టు తొలిసారిగా ఇక్కడ టెస్ట్ గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో చరిత్రాత్మకమైన విజయాన్ని కూడా అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ 187 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇలా బర్మింగ్‌హామ్‌లో ఒక ఇండియన్ బౌలర్ చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇవే. ఇదిలా ఉండగా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాష్ దీప్ మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యాడు.

Read Also:Minister Vasamsetti Subhash: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టే జగన్ పర్యటనలపై ఆంక్షలు..!

మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు అందరూ గెలిచిన ఆనందంలో ఉంటే, ఆకాష్ దీప్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. తాజాగా తన గుండెల్లో దాచుకున్న భారాన్ని బయటపెట్టాడు. తాను ఇక్కడ అద్భుత ప్రదర్శన చేస్తున్నా, తన అక్క అక్కడ కాన్సర్ తో పోరాడుతోందని తెలిపాడు. దీంతో అక్కడున్న తోటి ప్లేయర్లు కూడా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని తన సోదరికి అంకితమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Read Also:HBD MS Dhoni: ఇందుకే కదయ్యా నిన్ను మిస్టర్ కూల్ అనేది.. ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు.. వీడియో వైరల్

ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. నా ప్రదర్శన చూసి అందరికంటే తనే ఎక్కువ సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ మ్యాచ్‌ను ఆమెకే అంకితం ఇస్తున్నా. అంతే కాదు నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ ఆమె ముఖమే నా మదిలో మెదిలింది. మేమంతా నీతోనే ఉన్నాం” అని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆకాశ్ దీప్ ఆస్పత్రిలో తన అక్క బాగోగులు చూసుకుంటూ గడిపాడు. ఒకవైపు జాతీయ జట్టులో స్థానం దక్కిన ఆనందం, మరోవైపు అక్క అనారోగ్యం తనను మానసికంగా కుంగదీసిన ధైర్యంగా నిలబడ్డానని చెప్పాడు.

Exit mobile version