Akash-Shloka Ambani: ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, అతని కోడలు శ్లోకా మెహతా అంబానీ తమ కుమార్తె పేరును వెల్లడించారు. దంపతులు తమ కుమార్తెకు ‘వేద’ అని పేరు పెట్టారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వేద పేరును ఆమె సోదరుడు పృథ్వీ అంబానీ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆకాష్, శ్లోక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.
Read Also:Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం
ఈ పోస్ట్‌లో ‘శ్రీకృష్ణుడి దయ, ధీరూభాయ్, కోకిలాబెన్ అంబానీల ఆశీస్సులతో, పృథ్వీ (ఆకాష్-శ్లోకా అంబానీల కుమారుడు) తన చెల్లెలు ‘వేద ఆకాష్ అంబానీ’ పేరును ప్రకటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆకాష్ భార్య శ్లోక కుమార్తెకు జన్మనిచ్చింది.
Read Also:Saturday Stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే విశేష ధనయోగం లభిస్తుంది
వేద ఆకాష్-శ్లోకాల రెండవ సంతానం
వేద ఆకాష్ మరియు శ్లోకాల రెండవ సంతానం. ఇద్దరిలో మొదటి బిడ్డ పేరు పృథ్వీ అంబానీ. శ్లోకా 2020లో పృథ్వీకి జన్మనిచ్చింది. ఆకాష్-శ్లోకాల కూతురి పేరు ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేద అనే పేరు వినగానే అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అంబానీ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ పేరును అందరూ మెచ్చుకుంటున్నారు.