Site icon NTV Telugu

Golmal 5 : బాలీవుడ్ కామెడీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ గోల్మాల్ 5లో విలన్ గా స్టార్ హీరో

Golmaal 5

Golmaal 5

గోల్మాల్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ ఐకానిక్ టీమ్. అజయ్ దేవ్‌గన్ గోపాల్‌గా, అర్షద్ వార్సీ మాధవ్‌గా, తుషార్ కపూర్ లక్కీగా, శ్రేయస్ తల్పాడే, కునాల్ ఖేము లక్ష్మణ్ పాత్రల్లో ప్రేక్షకులను నవ్వించారు. ముందు పార్ట్స్ లో కనిపించిన శర్మన్ జోషి కూడా ఈసారి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్ కామెడీ టైమింగ్‌నే గోల్మాల్ సిరీస్‌కు మేజర్ స్ట్రెంత్ గా నిలిచింది.2006లో విడుదలైన గోల్ మాల్: ఫన్ అన్ లిమిటెడ్ తో ప్రారంభమైన ఈ కామెడీ ఫ్రాంచైజీ బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, గోల్మాల్ అగెయిన్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి.

Also Read : ManiRatnam : మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతికి జోడిగా సాయి పల్లవి

ఈ నాలుగు సినిమాలతో గోల్మాల్ సిరీస్ బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ కామెడీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. అయితే గోల్మాల్ రిటర్న్స్‌లో కరీనా కపూర్ ‘ఏక్తా’గా అజయ్ దేవగన్ భార్య పాత్రలో నవ్వులు పంచగా… గోల్మాల్ 3లో ‘డబు’గా టాంబాయ్ స్టైల్‌తో ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా గోల్మాల్ అగెయిన్ లో ఆమె కనిపించకపోయినా… ఆమె చేసిన ఈ రెండు పాత్రలు సిరీస్‌లో ఆమెకు స్పెషల్‌ ఐడెంటిటీ క్రియేట్ చేశాయి. ఈసారి గోల్మాల్ 5లో కొత్త ట్విస్ట్ లు కూడా ఉండబోతున్నాయి. అందులో మెయిన్ గా కరీనా కపూర్ ప్లేస్ లో తమన్నా భాటియా హీరోయిన్‌గా యాడ్ అవుతుందని బి టౌన్ లో టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.

ట్రెజర్ హంట్ కామెడీ అడ్వెంచర్ గా రానున్న గోల్మాల్ 5లో.. అక్షయ్ కుమార్ కీలక విలన్ రోల్‌తో సర్ ప్రైజింగ్ ఎంట్రీ ఆసక్తిని కలిగిస్తోంది. బాల్డ్ లుక్‌లో అక్షయ్ కనిపించి… కామెడీతో పాటు ఒక కొత్త నెగటివ్ షేడ్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రియమణి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇక తమన్నా భాటియా ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్‌కు జంటగా నటించే అవకాశం ఉండగా. అక్షయ్ కుమార్ క్యారెక్టర్‌కు జంటగా ప్రియమణి కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే “ఎంటర్‌టైన్‌మెంట్” సినిమాలో కలిసి నటించిన అక్షయ్ – తమన్నా జంట మళ్లీ ఈ సినిమాలో కనిపించబోతుండటం కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా మారింది. మళ్లీ రోహిత్ శెట్టి తన స్టైల్ కామెడీ, యాక్షన్ మిక్స్, గోల్మాల్‌కు మరోసారి హైలైట్ కానుంది. ప్రస్తుతం ముంబై ఫిల్మ్ సిటీలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి పాత గోల్మాల్ గ్యాంగ్ + కొత్త స్టార్స్ కాంబోతో… “గోల్మాల్ 5” 2027లో బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version