NTV Telugu Site icon

Aishwarya Rajinikanth : లాల్ సలామ్ ఫెయిల్ అవడానికి కారణం అదే..?

Whatsapp Image 2024 03 09 At 11.02.39 Am

Whatsapp Image 2024 03 09 At 11.02.39 Am

గత ఏడాది రిలీజ్ అయిన జైలర్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ ఆ తరువాత తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ అనే మూవీలో గెస్ట్ రోల్ లో నటించారు.భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన లాల్‌సలామ్ డిజాస్టర్ అయ్యింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా లాల్‌సలామ్‌ నిలిచింది.తెలుగు వెర్షన్ అయితే మరీ దారుణంగా కోటి కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. తొలిరోజే థియేటర్లలో జనాలు లేక చాలా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ సినిమాలో విష్ణువిశాల్‌, విక్రాంత్  హీరోలుగా నటించారు. కానీ రజనీకాంత్ పేరును ప్రమోషన్స్‌లో ఎక్కువగా వాడుకున్నారు. సినిమాలో  రజనీకాంత్ క్యారెక్టర్ కేవలం 30 నిమిషాల లోపే ఉండటం, పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో లాల్ సలామ్‌ను అభిమానులు తిరస్కరించారు.

లాల్ సలామ్ రిజల్ట్‌పై దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా రియాక్ట్ అయ్యింది. తండ్రి రజనీకాంత్ క్యారెక్టర్‌లో చేసిన మార్పుల వల్లే తాము అనుకున్న రిజల్ట్ రాలేదని తెలిపింది.ముందుగా తాను రాసుకున్న కథలో రజనీకాంత్ క్యారెక్టర్ సెకండాఫ్‌లో కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని ఐశ్వర్య తెలిపింది. “రజనీకాంత్ కోసం సెకండాఫ్ వరకు అభిమానులు వేచిచూడటం కష్టమని అనిపించింది. కథలో ఆయన పాత్ర మరి చిన్నగా ఉంటే డిసపాయింట్ అవుతారని భావించాం. రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు రజనీకాంత్ క్యారెక్టర్‌లో చాలా మార్పులు చేశాం. ఫస్ట్‌హాఫ్‌లోనే రజనీ పాత్రను పరిచయమయ్యేలా సినిమాను ఎడిట్ చేశాం. సెకండాఫ్‌లో రజనీకాంత్ క్యారెక్టర్ లెంగ్త్ ను పెంచాం. రజనీకాంత్ పాత్ర కోసం కథకు సంబంధం లేని చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు జోడించాల్సి వచ్చింది.ఈ కమర్షియల్ హంగుల కారణంగా కథ వీక్ అయిపోయింది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ కూడా నేను అనుకున్నట్లుగా కాకుండా మరోలా మారిపోయింది” అని ఐశ్వర్య రజనీకాంత్ తెలిపింది. ఈ మార్పులన్నీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు చేశామని, అది కూడా సినిమా ఫెయిల్యూర్‌కు ఓ కారణమని ఐశ్వర్య రజనీకాంత్ అన్నారు.