15 GB Data and Xstream Play Susbcription Free in Airtel Rs. 148 Prepaid Recharge Voucher Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం నిత్యం కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంటుంది. తక్కువ ధరలో డేటా, అపరిమిత కాల్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. యాక్టివ్ ప్లాన్‌లోనే దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కూడా అనుమతి లభిస్తుండటం విశేషం.
రూ. 148 డేటా వోచర్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తంగా 15 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా వినియోగానికి పరిమితులు ఉండవు. మీ రెగ్యూలర్ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసేలోగా.. ఈ 15 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌నూ ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్ నౌ, హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లేతో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు.
రూ. 148 డేటా వోచర్‌తో రీఛార్జ్ చేసుకున్నాక ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ద్వారా మాత్రమే ఓటీటీలకు అనుమతి ఉంటుంది. 28 రోజుల పాటు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే ఎయిర్‌టెల్ దీంతో పాటు రూ. 149 రీఛార్జ్‌తో ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటా మాత్రమే వస్తుంది.
Also Read: Anasuya Bharadwaj Hot Pics: అందాల అనసూయ.. అక్కడ టాటూ అదుర్స్!