ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తోంది. తరచుగా రీఛార్జ్ చేయడం కంటే ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారి కోసం సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది ఒకే రీఛార్జ్ తర్వాత, ఒక సంవత్సరం పాటు మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ మీకు ఒక సంవత్సరం పాటు డేటా, కాలింగ్‌ను అందించడమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Also Read:Off The Record: ఆ మంత్రికి పదవి మూన్నాళ్ళ ముచ్చటేనా? మాజీ క్రికెటర్ ఆశలు అడియాశలేనా?
ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లలో ఒక ప్రత్యేక ప్లాన్ ఉంది. దీనిని రూ.3,999 కు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో యూజర్‌కు 1 సంవత్సరం చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్ కింద, మీరు రోజుకు 2.5GB డేటాను పొందుతారు. సంవత్సరం పాటు అపరిమిత లోకల్, STD కాలింగ్‌తో సహా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. రోజుకు 100 ఉచిత SMSలను కూడా పొందుతారు.
Also Read:Tamil Nadu: తమిళనాట “ఎల్టీటీఈ” ప్రభాకరన్ ఫోటో వివాదం.. ఇరకాటంలో కాంగ్రెస్..
ఎయిర్‌టెల్ 3,999 ప్లాన్ అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఒక సంవత్సరం పాటు ఉచిత జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా, ఇది అపరిమిత 5G డేటా, 30 రోజుల పాటు ఉచిత హెలోట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు Perplexity Pro AI యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
