Site icon NTV Telugu

Air Taxi : త్వరలోనే అందుబాటులోకి ఎయిర్ ట్యాక్సీలు

Air Taxi

Air Taxi

Air Taxi: సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఓలా, ఉబర్ ట్యాక్సీలు జనాల్లోకి చొచ్చుకెళ్లాయి. త్వరలోనే కార్ల స్థానంలోకి కారు ఫ్లైట్స్ రాబోతున్నాయి. రోడ్లపై తిరుగుతున్న ట్యాక్సీలు ఇకపై గాల్లో ప్రయాణించనున్నాయి. చిన్న విమానాలను భవిష్యత్తులో ట్యాక్సీలుగా నడపనున్నారు. ఎప్పటినుంచో ఆలోచనల్లో ఉన్న ఈ ఎయిర్ ట్యాక్సీల కాన్సెప్ట్ ను దుబాయ్ లో 2026నుంచి తీసుకురానున్నారు. ఈ మేరకు దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఫ్లైయింగ్ ట్యాక్సీల డిజైన్లకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఎయిర్ ట్యాక్సీలు దిగేందుకు అనువైన వెర్టిపోర్టుల నిర్మాణం మరో మూడేళ్లలో సాకారం కానుందని వెల్లడించారు.

Read Also: A village without TV: ఆ ఊరిలో ఏ ఇంట్లోనూ టీవీ ఉండదు

ఎయిర్ ట్యాక్సీలతో రహదారి ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, ప్రయాణ వ్యవధి కూడా బాగా తగ్గుతుంది. ఈ చిన్న తరహా విమానాల్లో చార్జీలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందనక్కర్లేదు. ఊబర్ రైడ్ తో పోల్చితే కూడా చవకగానే ఉంటాయని దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చీఫ్ అహ్మద్ బెహ్రోజియన్ వెల్లడించారు. ఎయిర్ ట్యాక్సీల రేట్లు అన్ని వర్గాలకు అందుబాటులోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఎయిర్ ట్యాక్సీల ఉత్పాదన పెరిగే కొద్దీ, టెక్నాలజీ వ్యయం కూడా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు. దుబాయ్ లో ఈ ఎయిర్ ట్యాక్సీలను 240 కిమీ పరిధిలో నడపనున్నారు. వీటి గరిష్ఠ వేగం గంటకు 300 కిమీ. వీటిని యూఏఈలోని ఇతర నగరాల మధ్య కూడా తిప్పుతామని బెహ్రోజియన్ తెలిపారు. దాంతో దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ వ్యవధి గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు.

Exit mobile version