Site icon NTV Telugu

Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!

Air India

Air India

Air India Flight Crash Live Updates : అహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విహరించి, మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో నివాస ప్రాంతాల్లో కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. అందులో పలువురు వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. కానీ అధికారికంగా దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దీనికి ముందు, విమానం మేఘానీనగర్‌ ప్రాంతంలోని ఓ పెద్ద చెట్టును ఢీకొట్టి కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి 12 ఫైరింజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. దట్టమైన పొగ ప్రాంతమంతా కమ్ముకున్నది. ఈ ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే గుజరాత్‌కు బయలుదేరారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగిందన్న వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్..

Exit mobile version