TG Municipal Election Results: ఆ మున్సిపాలిటీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ విజయకేతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Municipal Election Results: తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా ఓ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. 8వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జయశ్రీ విజేతగా తన ప్రత్యర్థిపై 270 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటి వరకు ఈ పార్టీ తెలంగాణలో గెలవడం ఇదే మొదటిసారి! ఈ పార్టీ గుర్తు సింహం గుర్తు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ పార్టీ గురించి పూర్తి వివరాలు విషయానికి వస్తే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది భారత జాతీయ కాంగ్రెస్‌లో ఒక వర్గంగా ప్రారంభమై, పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికిని కలిగి ఉంది. పార్టీ జెండా ఎర్రగా ఉండి, దూకే పులి చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జి. దేవరాజన్ ఈ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
READ MORE: Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్‌హోల్.! వీడియో వైరల్..
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు వినగానే భారత జాతి పులకిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఆరాధన భావం ఉప్పొంగుతుంది. సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరమగలమని ప్రకటించారు. ‘‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వేచ్ఛను ఇస్తాను’’ అని యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు. ‘‘జైహింద్’’ నినాదంతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. దేశ ప్రజలంతా ఆయన్ను ‘నేతాజీ’గా పిలుస్తారు. అయితే… 1938లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా బోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాంధీజీతో విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించారు. 1940లో ఆ పార్టీ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది.
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..