NTV Telugu Site icon

AI Notes Writing: ఇకపై నోట్స్ రాయడం గురించి బయపడాలిసిన అవసరంలే.. ఏఐ మెషిన్ తనంతట తానే..

Ai Homework Machine

Ai Homework Machine

AI Notes Writing: సాంకేతికత విస్తృతంగా ప్రస్తుతం చాలా చోట్ల AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి వివిధ కొత్త సాఫ్ట్‌వేర్, యంత్రాలు మార్కెట్‌ లోకి వస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారంతో సహా అనేక విషయాలలో AI విస్తృతంగా ఉపయోగించబడుతోంది. చదువుల కోసం పాఠశాలల్లో కూడా AI ఉపయోగించబడుతోంది. అయితే AIని వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చు అనే విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.

Budget 2024 : రూపాయి ఎక్కడ నుండి వస్తుంది.. ఎక్కడికి పోతుంది? బడ్జెట్ తీరు తెలుసుకుందాం

ఆ వీడియోలో ఒక యంత్రం దాని సమీపంలో కాగితంపై చేతివ్రాతతో నోట్స్ సిద్ధం చేస్తోంది. ఇక్కడ మనిషి అవసరం లేదు. యంత్రం తనంతతానే పేజీలను మారుస్తుంది., కాపీని సరిచేస్తుంది. వ్యక్తి దూరంగా కూర్చుని యంత్రం ఏమి రాస్తుందో చూస్తే చాలు. ఇది AI ఆధారిత యంత్రం. దీనిని జుగాద్ ఉపయోగించి ఓ భారతీయ ఇంజనీర్ తయారు చేశారని వీడియో కాప్షన్ లో పేర్కొన్నారు. ఇకపోతే యంత్రం వ్రాసిన పేజీని చూస్తే, అది చేతితో వ్రాసిందా లేదా యంత్రం ద్వారా వ్రాసిందా అని కనుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఇందుకు సంబంధిత వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లక్షల మందికి పైగా వీక్షించగా.. వేల మంది కామెంట్లు చేశారు. కేరళకు చెందిన దేవదత్ అనే యువకుడు ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు సమాచారం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైనర్. ఇక్కడ మిషన్ విశేషాలేంటంటే.. యంత్రంలో రోబోటిక్ చేయి, ఒక కెమెరా ఉంటుంది. ఇది కంటెంట్‌ను చదివిన తర్వాత చాలా తక్కువ సమయంలో అచ్చం చేతి వ్రాతతో ఉన్న విధంగా రాసి ఇస్తుంది.

ACB Rides: ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్‌..

ఇక ఈ వీడియోను చుసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మన కాలంలో ఇది ఎందుకు లేదని కొందరు కామెంట్ చేస్తుండగా.. ఇక స్కూల్ లేదా కాలేజీ పిల్లలకు హోమ్ వర్క్ కష్టాలు తీరినట్లే అని కామెంట్ చేస్తున్నారు.