AI Chatbot: కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్లు, ముఖ్యంగా ChatGPT వంటి టూల్స్ మన రోజువారీ పనిలో భాగమవుతున్నాయి. ఈ మెయిల్స్ రాయడం, చిన్న విషయాలకు సమాధానాలు పొందడం, సాధారణ సమాచారం తెలుసుకోవడం వంటి చిన్న పనుల్లో ఇవి సహాయకాలుగా మారాయి. మనిషిలా మాట్లాడే తీరు వీటిని మరింత నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఇదే నమ్మకం కొన్నిసార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. నిపుణులు హెచ్చరిస్తూ చెబుతున్నది ఏమిటంటే.. ఏఐ చాట్‌బాట్లలో అధికంగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ప్రైవసీ ఉల్లంఘన, డేటా చోరీ, ఐడెంటిటీ చోరీ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. చాట్‌బాట్లతో చేసే సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉండవు. మీరు ఇచ్చిన సమాచారం స్టోర్ కావడం, విశ్లేషణ చేయబడటం, కొన్నిసార్లు బయటపడటం కూడా జరుగవచ్చు. కాబట్టి ఎలాంటి సమాచారాన్ని ఏఐ చాట్‌బాట్లతో చెప్పకూడదో చూద్దాం..
పాస్‌వర్డ్లు:
ఏఐ చాట్‌బాట్లకు ఎప్పుడూ మీ లాగిన్ పాస్‌వర్డ్లు ఇవ్వకండి. ఇలా చేస్తే మీ ఈమెయిల్, బ్యాంకు, సోషల్ మీడియా ఖాతాలు సులభంగా హ్యాక్ అవ్వవచ్చు. కాబట్టి నిపుణులు సురక్షితమైన పాస్‌వర్డ్ మేనేజర్లు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
ఆర్థిక వివరాలు:
బ్యాంక్ అకౌంట్ నంబర్లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, ప్రభుత్వ ఐడీలు వంటి వాటిని AI ద్వారా పంచుకోవడం చాలా ప్రమాదకరం. ఇవి లీక్ అయితే మోసం, చోరీ, ఫ్రాడ్ వంటి సమస్యలు తప్పవు. ఆర్థిక వివరాలు ఎప్పుడూ అధికారిక ఛానెల్‌ల్లో మాత్రమే పంచుకోవాలి.
200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న Realme 16 Pro 5G!
ఫోటోలు లేదా డాక్యుమెంట్లు:
ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు లేదా ప్రైవేట్ ఫోటోలు ఏఐ చాట్‌బాట్లో అప్లోడ్ చేయడం పూర్తిగా తప్పు. మీరు తొలగించినప్పటికీ వాటి డిజిటల్ ట్రేస్‌లు ఉండే అవకాశం ఉంది. ఇవి హ్యాక్ అయ్యి దుర్వినియోగం అవుతాయి.
ఉద్యోగానికి సంబంధించిన సీక్రెట్ సమాచారం:
కంపెనీ వ్యూహాలు, అంతర్గత రిపోర్టులు, వ్యాపార రహస్యాలు వంటి వాటిని AI టూల్స్‌లో పేస్ట్ చేయడం డేటా లీక్‌లకు కారణమవుతుంది. ఇది కంపెనీ భద్రతకే కాకుండా మీ ఉద్యోగానికీ ప్రమాదం.
చట్టపరమైన సమస్యలు:
కాంట్రాక్టులు, కోర్టు కేసులు, వ్యక్తిగత వివాదాల వివరాలను చాట్‌బాట్లతో పంచుకోవడం సమంజసం కాదు. ఇవి బయటపడితే మీ కేసులకు నష్టకరం. అంతేకాకుండా AI ఇచ్చే లీగల్ సలహా అసంపూర్ణం లేదా తప్పుగా ఉండే అవకాశం ఉంది.
ఆరోగ్య, వైద్య సమాచారం:
మీ ఆరోగ్య లక్షణాలు, రిపోర్టులు లేదా చికిత్స వివరాలను AIతో పంచుకోవద్దు. వైద్య సమాచారం లీక్ అవ్వడం చాలా ప్రమాదకరం. అలాగే AI ఇచ్చే ఆరోగ్య సలహాలను నమ్మడం తప్పుదోవ పట్టించొచ్చు. డాక్టర్లనే సంప్రదించడం మంచిది.
రూ.1,44,000 పైగా భారీ తగ్గింపుతో Sony BRAVIA 3 Series 75 అంగుళాల 4K Google TV..!
వ్యక్తిగత వివరాలు:
పూర్తి పేరు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు చిన్నవిగా కనిపించినా వీటిని కలిపితే మీ మొత్తం వ్యక్తిగత ప్రొఫైల్ బయటపడుతుంది. ఇది స్కామ్‌లు, ఫిషింగ్, ట్రాకింగ్ వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది.
రహస్యాలు లేదా వ్యక్తిగత సమస్యలు:
ఏఐ చాట్‌బాట్లు థెరపిస్టులు లేదా సన్నిహితుల మాదిరి గోప్యత కాపాడవు. రహస్యాలను చెప్పడం వల్ల అవి లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచొచ్చు.
ప్రైవసీ కోరుకునే అలవాట్లు, వ్యక్తిగత విషయాలు:
మీరు ఎవరికీ చెప్పదలచుకోని అలవాట్లు, పనులు, ప్రైవేట్ విషయాలను AIలో మాట్లాడడం డేటా రికార్డ్ అవ్వడానికి దారి తీయొచ్చు. భవిష్యత్తులో ఇవి బయటపడే అవకాశాలు ఉంటాయి.
అసభ్యకర, చట్టవిరుద్ధ కంటెంట్:
అశ్లీల కంటెంట్, అభ్యంతరకర వ్యాఖ్యలు, చట్టవ్యతిరేక విషయాలు షేర్ చేయడం రికార్డు కావచ్చు. ఇది ఖాతా సస్పెన్షన్‌కు, చట్టపరమైన సమస్యలకు కూడా కారణమవుతుంది.
