Ahimsa : ఓటీటీ లోకి వచ్చేసిన “అహింస”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చేసాక చిన్న సినిమా ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే ఓటీటీ లో విడుదల అయి సందడి చేస్తున్నాయి.అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్స్ లో విడుదల అయినా ఎప్పటికో గాని ఓటీటీలో స్ట్రీమింగ్ రావడం లేదు. ఇప్పటికే అలా చాలా సినిమా లు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. ఆ సినిమాలు విడుదలైన రెండు నుంచి మూడు నెలలకు ఓటీటీలోకి వస్తుంటాయి.కానీ ఇప్పుడు ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఆరు నెలలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే దర్శకుడు తేజ తెరకెక్కించిన అహింస.. ఈ సినిమా జూన్లో రిలీజ్ అయి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ కన్నా ముందే టీవీ లో కూడా వచ్చేసింది..భారీ హైప్ తో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. కానీ రిలీజ్ మాత్రం చేయలేదు. సెప్టెంబరులో ఈ మూవీ టీవీల్లోకి కూడా వచ్చేసింది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. కానీ తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు ఆరు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో అహింస మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు మరియు పాన్ ఇండియా స్టార్ హీరో రానా దగ్గుబాటి సోదరుడు అయిన దగ్గుబాటి అభిరామ్ ఈ మూవీతో హీరోగా టాలీవుడ్ కీ ఎంట్రీ ఇచ్చాడు.నిర్మాత సురేష్ బాబు డైరెక్టర్ తేజ కు దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ భాద్యతలు అప్పగించారు. ఈఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదలైన అహింస ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో అభిరామ్ సరసన గీతికా తివారీ హీరోయిన్ గా నటించగా ఆర్పీ.పట్నాయక్ మ్యూజిక్ అందించారు.మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందో లేదో చూడాలి..
Also Read
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్కు రెడీ?.. గీక్బెంచ్లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!