NTV Telugu Site icon

Aha Unstoppable 4 : ఇది బాలయ్య పండుగ.. ప్రోమో అదిరింది బాసూ..

Balakrishna

Balakrishna

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. మొదటి మూడు సీజన్లలో సినీ, రాజకీయ ప్రముఖములను షోకు పిలిచి బాలయ్య గేమ్స్ ఆడించడం, రహస్యాలను బయటపెట్టించడం బాగా వర్కౌట్ అయింది. బాలయ్యలోని మరో కోణాన్ని బయటపెట్టిన ఈ షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఎప్పుడెప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సీజన్ 4 మొదటి ఎపిసోడ్ షూట్ జరిగిందని, సీజన్ 4 మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని వార్తలు వచ్చాయి.

READ MORE: Iran: “ఇజ్రాయిల్‌కి సాయం చేయవద్దు, లేదంటే”.. సౌదీ, యూఏఈలకు ఇరాన్ వార్నింగ్..

ఇవన్నీ పక్కన పెడితే దసరా పండుగ సందర్భంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ను ఆహా ఘనంగా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఇక షో సీజన్ 4 గురించి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. యానిమేషన్ లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో బాలకృష్ణ ఒక సూపర్ హీరోగా కనిపించారు. అసలు పండుగే లేని ప్రాంతానికి ఆయన బాలయ్య పండుగను తీసుకు వెళ్లినట్టు చూపి ఆసక్తి పెంచేశారు. బాలకృష్ణ 50 ఇయర్స్ ను ఈ షో ద్వారా సెలబ్రేట్ చేసేందుకు ఆహా టీం సిద్ధమైంది.

READ MORE:Dollar Rupee Exchange Rate: పెరిగిన డాలర్ బలం.. కనిష్ట స్థాయికి చేరిన “రూపాయి”.. కారణాలు?

 

Show comments