NTV Telugu Site icon

Balu Gani Talkies : ఆహాలో దూసుకుపోతోన్న ‘బాలు గాని టాకీస్’

New Project 2024 10 13t125828.641

New Project 2024 10 13t125828.641

Balu Gani Talkies : యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ అంటూ తమ సత్తాను చాటి.. సిల్వర్ స్క్రీన్ మీద విజయాలందుకున్న వారు ఎంతో మంది. ఇప్పుడు టాలెంట్‌ను ప్రదర్శించేందుకు రకరకాల మాధ్యమాలున్నాయి. ఇండస్ట్రీలోనూ ప్రస్తుతం కొత్త తరం దర్శక నిర్మాతలు, ఆర్టిస్టుల హవా నడుస్తోంది. కాన్సెప్ట్, కంటెంట్ అంటూ చిన్న చిత్రాలతో పెద్ద సక్సెస్‌లను అందుకుంటున్నారు. యువ దర్శకులంతా కూడా తమ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ ప్రతాప్ ‘బాలు గాని టాకీస్’ అంటూ అందరినీ మెప్పించాడు.

శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి వంటి వారితో విశ్వనాథ్ ప్రతాప్ తీసిన బాలు గాని టాకీస్ ఆహాలో అక్టోబర్ 4న విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని శ్రీనిధి సాగర్ నిర్మించారు. రూపక్ ప్రణవ్ తేజ్, గుడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో ట్రెండ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చే కొత్త కంటెంట్‌ను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బాలు గాని టాకీస్ ఆహాలో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. తన మేకింగ్‌తో విశ్వనాథ్ ప్రతాప్ అందరినీ మెప్పించారు.

Read Also:Devara Collections : రూ.500కోట్లు దాటిన దేవర కలెక్షన్లు

Read Also:AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు

Show comments