Site icon NTV Telugu

Nenu SuperWoman: మూడో వారంలో 90 లక్షలు ఇన్వెస్ట్ చేయనున్న ఆహా ‘నేను సూపర్ ఉమెన్’

Aha Nenu Super Woman

Aha Nenu Super Woman

Nenu SuperWoman: జీవితం అంటే పోరాటం, ఆ పోరాటంలోనే ఉంది జయం అని అనుకున్న ఎంతో మందిలో మన ఆహా నేను సూపర్ ఉమెన్ కి చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. వి హబ్ తో కలిసి స్టార్ట్ అప్ ఉమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కోసం నేను సూపర్ ఉమెన్ అనే షో తోటి ఆహా ఇప్పటికి తెలుగు రాష్ట్ర ప్రజల మనసులని గెలుచుకుంది. ఇపుడు మరిన్ని సరికొత్త ఎపిసోడ్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాయ్. ఈ వారం అక్షరాలా 90 లక్షలు మన ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ దక్కింది.. ఎవరు ఎవరి మెంటార్షిప్ అందుకున్నారో తెలుసుకోవాలి అంటే ఈ 4, 5 ఆగష్టు రాత్రి 7 గంటలకు ఆహలో మన ‘నేను సూపర్ ఉమన్’ షో తప్పక చూడండి.

Read Also:TMC MP Nusrat Jahan: 429 మంది బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన హీరోయిన్.. ప్రస్తుతం ఓ ఫేమస్ ఎంపీ

మొదటి రెండు వారాల్లో ఏంజెల్స్ మొత్తం 3 కోట్లు ఇన్వెస్ట్ చేసారు. అమ్మమ్మాస్, జితారా, భయోరస్ ఫార్మా, టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్, డాగీ విల్లే లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ వారం ఎపిసోడ్స్ లో మన ఏంజెల్స్ ఇన్వెస్ట్మెంట్, మెంటోర్షిప్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

Read Also:Maruti Brezza Price 2023: కేవలం 5 లక్షలకే మారుతి బ్రెజా.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!

ఆహా ‘నేను సూపర్ ఉమెన్’- ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోల భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా)

Exit mobile version