NTV Telugu Site icon

India China LAC: వాస్తవ నియంత్రణ రేఖపై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్ – చైనా మధ్య ఒప్పందం

India China

India China

India China LAC: భారత్ – చైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) పై పెట్రోలింగ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి ఇరు దేశాలు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో, సరిహద్దు నుండి దళాల ఉపసంహరణ ప్రక్రియను తగ్గించడంలో ఈ ఒప్పందం ప్రధాన చర్యగా పరిగణించబడుతుంది.

Read Also: Bomb Threat: 30 విమానాలను పైగా బాంబు బెదరింపులు.. 8 రోజుల్లో 120కి పైగా విమానాలకు

ఈ ఒప్పందాన్ని ప్రకటించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ భారత్‌ – చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించగలదని అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీనిని పెద్ద దౌత్య విజయంగా అభివర్ణించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాస్కో సమావేశం తర్వాత ప్రారంభమైన చర్చలు దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో దేప్సాంగ్ మైదానాలు, డెమ్‌చోక్ వంటి ప్రధాన సంఘర్షణ ప్రాంతాల నుండి దళాలను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది.

Read Also: CRPF Schools: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా CRPF పాఠశాలలపై బాంబులు వేస్తామంటూ బెదిరింపులు

అనేక రౌండ్ల సైనిక చర్చల తర్వాత ఈ ఒప్పందం సాధ్యమైంది. ఇది పాంగోంగ్ త్సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి ఇతర ఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకోవడానికి దారితీసింది. ఈ విషయంపై విదేశాంగ కార్యదర్శి మిస్రీ మాట్లాడుతూ.., గత కొన్ని వారాలుగా ఇరుపక్షాలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు LAC వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయని, దీని ఫలితంగా దళాల ఉపసంహరణ జరుగుతుందని అన్నారు.