Site icon NTV Telugu

Naga Vamsi: దేవర రైట్స్ వార్తలు.. నాగ వంశీ ఏంటి ఇలా అనేశాడు

Nagaa

Nagaa

గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా దేవర.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది.. అక్టోబర్ లో సినిమా జనాల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయ్యాక ఈ సినిమా చివరి షెడ్యూల్ లో పాల్గొంటాడు.. కాగా, ఈ సినిమా రైట్స్ ను సితార బ్యానర్ సొంతం చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు..

ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ఇండస్ట్రీలోని పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని వార్త షికారు చేస్తుంది.. అందులో సితార ఎంటర్టైన్మెంట్స్ రైట్స్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ రూమర్స్ పై స్పందిస్తూ నాగవంశీ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు.. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసి సినిమాలకు సంబంధించిన విషయాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం.. కాబట్టి రూమర్స్ నమ్మకండి.. అంటూ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. కొరటాల, ఎన్టీఆర్ కొంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. మే లోపు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నారు..

Exit mobile version