పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల 3-పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. అతను సాధించిన ఈ ప్రత్యేక విజయానికి సెంట్రల్ రైల్వే బహుమతి ఇచ్చింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో కుసాలే ఏడో స్థానంలో నిలిచాడు.
Read Also: Zomato: దూసుకుపోతున్న జొమాటో షేర్లు..గంటల్లోనే కోట్ల లాభం
పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు గాను.. భారత షూటర్ స్వప్నిల్ కుసాలే సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ సెల్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పదోన్నతి పొందారు. ఇంతకు ముందు కుసాలే టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేస్తుండే వాడు. మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుసాలేకు కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. కుసాలేకు మహారాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల రివార్డును ప్రకటిస్తోందని, ఒలింపిక్స్ నుంచి తిరిగి రాగానే అతడికి ఘనంగా స్వాగతం పలుకుతామని షిండే తెలిపారు. మరోవైపు.. ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు భాగంగా.. స్పీకర్ ఓం బిర్లా స్వప్నిల్ కుసలేను అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుసాలేను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందించారు.
Read Also: Air India: ఇజ్రాయిల్-ఇరాన్ టెన్షన్.. టెల్ అవీవ్‌కి విమానాలు నిలిపేసిన ఎయిర్ ఇండియా..
క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌లో కూడా, స్వప్నిల్ మోకాలి మరియు ప్రోన్ రౌండ్‌ల తర్వాత ఆరో స్థానంలో ఉన్నాడు. అతను స్టాండింగ్ పొజిషన్‌లో అద్భుతంగా పునరాగమనం చేసాడు. తన మొదటి ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాన్ని సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో కుసాలే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 60 షాట్‌లలో 590 పాయింట్లతో మొదటి ఎనిమిది షూటర్‌లలో నిలిచాడు. ఇందులో 38 ఇన్నర్ 10లు ఉన్నాయి. కుసాలేతో పాటు మరో భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 589 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.