Baby Girl : ఆడపిల్ల ఇంటికి అందం అంటారు. ఎంతమంది కొడుకులున్నా ఆ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆ వెలితి కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆడపిల్లను మహాలక్ష్మి అంటూ దేవతలతో పోలుస్తారు. అందుకే చాలా మంది తమకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటారు. ఓ తండ్రి తల్లి తరువాత అంతటి స్థానం బిడ్డకు మాత్రమే ఇస్తాడనడంతో సందేహంలేదు. ఓ కుటుంబంలో తరతరాలుగా అందరూ అబ్బాయిలే పుట్టారు. ఆడపిల్ల పుడితే బాగుండు అని ఏళ్ల కొద్ది ఎదురు చూసినా ఫలితం లభించలేదు. వారి పూజలు ఫలించాయేమో 138 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో మొదటిసారి ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.
Read Also: Jobs Fraud: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా.. లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
అమెరికాలోని మిచిగాన్‌కి చెందిన కరోలిన్, ఆండ్రూ క్లార్క్ జంటకు నాలుగేళ్ల క్రితం కామెరూన్ అనే కొడుకు ఉన్నాడు. మార్చి నెలలో రెండవ బిడ్డగా ఆడశిశువుకి జన్మనిచ్చారు ఈ దంపతులు. ఆ చిన్నారికి ఆడ్రీ అని కూడా పేరు పెట్టుకున్నారు. ఈ చిన్నారి 138 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి వంశంలో మొదటి ఆడ శిశువుగా జన్మించింది. 1885 తర్వాత ఆండ్రూ వంశంలో ఆడపిల్ల పుట్టలేదు. ఈ విషయాన్ని తన భర్త ద్వారా తెలుసుకున్న కరోలిన్ కూడా ఆశ్చర్యపోయింది. ఆడ్రీ పుట్టకముందు కరోలిన్ కి రెండు సార్లు అబార్షన్స్ అయ్యాయి. ఇక రెండవ బిడ్డగా ఎవరు పుట్టినా సరే ఆరోగ్యంగా ఉంటే చాలని ఆ దంపతులు కోరుకున్నారు. అయితే ఆ జంటకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కాగా ఇప్పటి వరకూ మగపిల్లలకు పేర్లు పెట్టగలిగిన ఆ కుటుంబానికి తమ కుమార్తెకు పేరు పెట్టడంలో కాస్త ఇబ్బంది ఎదురైందట. చివరకు ఆడ్రీ అనే పేరును సెలక్ట్ చేసుకున్నారు. ఆడ్రీ రాకతో కరోలిన్ సంతోషానికి అవధులు లేవు. వీరి కథనం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
